ఆచార్య కాస్త ఆలస్యమేనటా

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా మీద అభిమానుల  ఆసక్తి అంతా ఇంతా కాదు. ఎపుడు  సినిమా వస్తుందన్న ఆశతో వారు ఎదురుచూస్తున్నారు. కానీ క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి ప‌లు పెద్ద సినిమాల విడుద‌ల వాయిదా ప‌డ‌డంతో సినీ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు వాయిదా ప‌డ్డ సినిమాల జాబితాలో చిరంజీవి 'ఆచార్య' సినిమా కూడా చేరింది. ఆచార్య సినిమాను ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో ఆ టీమ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆచార్య సినిమా బృందం త‌మ అధికారిక ఖాతా ద్వారా స్పందిస్తూ.. 'మ‌హమ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఆచార్య సినిమా విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం' అని తెలిపింది. కాగా, ప్ర‌స్తుతం పెద్ద హీరోల‌ సినిమాలు బంగార్రాజు, పుష్ప, అఖండ థియేట‌ర్ల‌లో ఆడుతున్నాయి. ప‌లు చిన్న సినిమాలూ సంక్రాంతికి సంద‌డి చేస్తున్నాయి.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: