నాడు విచారణ చేయకుండా...ఇపుడు విచారణనా..ఇది కుట్ర కాదా...?

నేడు ఆరోపణలు ఎదుర్కోంటున్న ఆ టీచర్లు లేని సమయంలో విచారణనా...?

బహుజన టీచర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కె.సతీష్ కుమార్


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

ఇద్దరు ఉపాధ్యాయులు తమకు లెక్కలు, సైన్స్, సోషల్ పాఠాలు చెప్పడంలేదని గతంలోనే విద్యార్థులు ఫిర్యాదులు చేసినపుడు స్పందించని గడివేముల ఎంఈఓ నాడు తాత్సారం చేసి ఇపుడు విచారణ చేపట్టడం ఎంతవరకు సబబో ఉన్నతాధికారులే చెప్పాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కె.సతీష్ కుమార్  ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంల గడివేముల మండల పరిధిలోని కొరటమద్ది గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు గత కొద్ది కాలం నుండి విద్యార్థులకు వారికి సంబంధించిన సబ్జెక్టులు లెక్కలు,ఇంగ్లీషు, సైన్స్, సోషల్ పాఠాలు చెప్పడం లేదని పిల్లలు ఆరోపణలు చేశారని, కానీ నాడు గడివేముల ఇంచార్జి ఎంఈఓగా ఉన్న బ్రహ్మం పాఠశాలల్లోని ఉపాధ్యాయులు పిల్లలకు ఏ విధంగా బోధన చేస్తున్నారనిగా నాడు తనిఖీ చేయకుండా ఇంతకాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.  విద్యార్థులు ఉపాధ్యాయుల పై ఆరోపణలు చేస్తే మండలానికి అధికారిగా ఉన్నఎంఈఓపై కూడా అభియోగం చేసినట్లేనని, ఆ లెక్క ప్రకారం చూస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఈఓ  బ్రహ్మం ఏ విధంగా, ఏ నిబంధన ప్రకారం బోధన చేయని ఉపాధ్యాయుల పై విచారించేందుకు అర్హత కలిగి ఉన్నారో విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలపాలని కె. సతీష్ కుమార్ ప్రశ్నించారు. అంతేకాక ఉన్నత పాఠశాలలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల్లో ఒక టీచరు మెడికల్ లీవ్ లో, మరొక టీచరు కరోనా పాజిటివ్ కారణంగా సెలవుల్లో ఉన్నారని, ఉపాధ్యాయులు లేని సమయంలో వారిపై విచారణ ఏ విధంగా చేస్తారని, ఉపాధ్యాయులు తప్పు చేశారని నిరూపించేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నెల 18 వ తేదీన విచారణ చేపడతాం అని చెప్పడం ఇందుకు నిదర్శనమని, ఆయన ఆరోపించారు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు  విధులకు హాజరైన తర్వాత విచారణ చేపట్టాలని, అప్పుడే నిజానిజాలు తెలుస్తాయని బహుజన టీచర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కె.సతీష్ కుమార్ కోరారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: