ఆ ఖాతాల్లో డబ్బు జమా


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఈపీఎఫ్ఓ డిపాజిటర్ల ఖాతాలో మొత్తం జమాచేసిన కేంద్రం వాటిని సరిచూసుకోవాలని కూడా సూచించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) డిపాజిటర్ల ఖాతాల్లో వడ్డీ డబ్బులు పడ్డాయి. 24.07 కోట్ల మంది అకౌంట్లలోకి ఆర్థిక సంవత్సరం 2020-21కి చెందిన 8.50 శాతం వడ్డీని క్రెడిట్ చేసినట్టు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఈపీఎఫ్ఓ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని చెప్పింది. 8.50 శాతం రేటుతో వడ్డీని 24.07 కోట్ల అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తెలిపింది. మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 7738299899 నెంబర్‌కి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ నుంచి మీ ఈపీఎఫ్ఓ యూఏఎన్ ఎల్ఏఎన్(లాంగ్వేజ్)ను ఎస్ఎంఎస్ రూపంలో పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీకు సమాచారం ఇంగ్లీష్‌లోనే కావాలనుకుంటే, ఎల్ఏఎన్‌కి బదులుగా ఈఎన్‌జీ అని టైప్ చేయాలి. అలాగే హిందీ కోసం హెచ్ఐఎన్, తమిళ్ కోసం టీఏఎం రాసి పంపాలి. మీకు సమాచారం హిందీలో కావాలనుకుంటే, ఈపీఎఫ్ఓహెచ్ఓ యూఏఎన్ హెచ్ఐఎన్ అని మెసేజ్ చేయాలి. మిస్డ్ కాల్ ద్వారా మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011 22901406కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. వెబ్‌సైట్ ద్వారా కూడా మీ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్‌ను సందర్శించి మీ ఖాతాల్లో డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. అయితే ఈ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలంటే, యూఏఎన్ , పాస్‌వర్డ్ నొక్కాల్సి ఉంటుంది. దీనిలోనే మీ పాస్‌బుక్‌ను చూసుకోవడం, డౌన్‌లోడ్ చేసుకోవడం చేయొచ్చు. ఆ తర్వాత మీ పాస్‌బుక్ ఓపెన్ అవుతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్‌ను వేసుకోవడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఉామాంగ్ యాప్ ఓపెన్ చేసి, ఈపీఎఫ్ఓను క్లిక్ చేయాలి. దానిలో ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్‌ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాస్‌బుక్‌ను నొక్కాలి. యూఏఎన్ నెంబర్‌ను పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: