ఫ్రాన్స్‌లోనూ విల‌యం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఫ్రాన్స్ లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో కేసులు పెరగడానికి ఇది కూడా కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఇటలీలోనూ రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం 1,89,109 కొత్త కేసులు నమోదయ్యాయి. 183 మంది ప్రాణాలు కోల్పోయారు. 33వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు .

బ్రిటన్‌లో కరోనా, ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. బుధవారం ఒక్కరోజే 1,94,747 మంది వైరస్ భారిన పడ్డారు. 343 మంది మరణించారు. 57 వేల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇంగ్లాండ్‌లో ప్ర‌స్తుతం లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని ఆదేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. లాక్ డౌన్‌కు బదులు ప్రణాళిక బి ని అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేయడం, ఉద్యోగులు వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోం వంటివి అమలు చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: