సంక్రాంతి పండుగ సందర్భంగా...

మంచాలకట్టలో కబడ్డీ పోటీలు

కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు
 (జానో జాగో వెబ్ న్యూస్-గడిమేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని మంచాలకట్ట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ( U-17 ) నిర్వహించారు. ఈ సందర్భంగా మంచాలకట్ట గ్రామానికి చెందిన వైయస్సార్ సిపి నాయకులు మేఘనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, బాలీశ్వర రెడ్డి, లు మాట్లాడుతూ


కబడ్డీ ఆట ఆడడం వల్ల యువకులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉంటారని, గ్రామాలలోని పిల్లలు, యువకులు సామాజికంగా దృఢంగా తయారవుతారని, తోటి వారి పట్ల స్నేహ భావం పెంపొందించుకుంటారని, పిల్లలు, యువకులు మనోధైర్యాన్ని, సహనాన్ని అలవాటు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేశామని కావున కబడి ఆడడానికి విచ్చేసిన క్రీడాకారులు, గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని పేర్కొన్నారు.

కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న ...నిర్వాహకులు 


జిల్లా స్థాయి కబడ్డీ( U-17 ) పోటీల్లో పాల్గొనడానికి కర్నూలు జిల్లా లోని వివిధ గ్రామాల నుండి 40 టీములు పాల్గొనగా, అందులో... మొదటి బహుమతి ని రేగడ గూడూరు గ్రామానికి చెందిన కబడ్డీ క్రీడాకారులకు 8000/-  వేల రూపాయలను మేఘనాథ్ రెడ్డి గారు అందజేశారు. రెండవ బహుమతి ని మంచాలకట్ట కు చెందిన క్రీడాకారులకు 5000/-  వేల రూపాయలను అనిల్ కుమార్ రెడ్డి గారు అందజేశారు. మూడవ బహుమతి హుసేనాపురం గ్రామానికి చెందిన కబడి క్రీడాకారులకు  3000/- వేల రూపాయలను బాలీశ్వర్ రెడ్డి గారు బహుమతిని అందజేశారు. వివిధ గ్రామాల నుండి కబడ్డీ పోటీల లో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులకు ఉచిత భోజన సదుపాయం కల్పించినందుకు, కబడ్డీ కమిటీ వారికి, మంచాలకట్ట గ్రామ ప్రజలకు, క్రీడాకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: