వ్యాక్సిన్ వేయించుకొనివుంటేనే దర్శనం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో గుడికైనా, బడికైనా, బండెక్కడానికైనా,  విమానంఎక్కడానికైనా వ్యాక్సినేషన్ వేసుకొన్న వారికే అనుమతి అని తేల్చి చెబుుతున్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు అలర్ట్.. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈఓ లవన్న తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌పై ఆలయ పరిపాలన భవనంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్, పోలీసు అధికారులు, మండల, దేవస్థానం డాక్టర్లు పాల్గొన్నారు. దర్శనార్థం వచ్చే శ్రీశైలానికి వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని తీసుకురావాలని ఈఓ లవన్న సూచించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో చంటిబిడ్డల తల్లులు శ్రీశైలం యాత్ర వాయిదా వేసుకుంటే మంచిదని ఆయన సూచించారు. దర్శానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ఇదిలావుంటే ఇటీవల శ్రీశైలంలో మల్లన్న స్పర్శ దర్శనం వేళలు పెంచుతున్నట్లు ఆలయ ఈఓ లవన్న తెలిపిన సంగతి తెలిసిందే. సామాన్య భక్తులకు ఉచితంగా గర్భాలయ స్పర్శ దర్శనం కలిపిస్తామని తెలిపారు. అయితే మహాశివరాత్రి పర్వదినానికి ముందు ఐదు రోజులపాటు గర్భాలయ స్పర్శ దర్శనం తాత్కాలికంగా రద్దు చేయనున్నారు. శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: