టీఎస్ పరిణామాలపై ఆరా


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ పూర్తిగా ఫోకస్ పెట్టింది. ఎలాగైనా ఈ రాష్ట్రంలో పాగా వేయాలని భావిస్తున్న కమల దళం వ్యూహ, ప్రతి వ్యూహాలను రచిస్తోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర పరిణామాలపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్, విడుదల తదితర అంశాలతో రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొంది. ఇదే అదనుగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లాయి. ఇవాళ ఆయన బండి సంజయ్ తో స్వయంగా మాట్లాడారు. బండి సంజయ్ కి ఫోన్ చేసిన మోదీ దాదాపు 15 నిమిషాల పాటు సంభాషించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష గురించి, అరెస్ట్ తదితర అంశాల గురించి చర్చించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: