త్వరలో అందుబాటులోకి...కృత్రిమ గుండె


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

ఆకాశంలోని చంద్రుడిపై నివాసాన్ని కనుకోవడం, మనిషి అవయవాల రూపకల్పన ఇలా అన్నింటి రూపకల్పనలో మానవుడు దూసుకెళ్తున్నాడు. తాజాగా మరో అవయవ రూపకల్పనకు విజయవంతం కాబోతోంది. కృత్రిమ అవయవాలను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా భారత పరిశోధకులు గుండెను ప్రయోగశాలలో తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కృత్రిమంగా గుండెను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్ ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అవసరమైన ప్రక్రియ ప్రారంభించింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఐఐటీ ప్రొఫెసర్లు, అమెరికా వైద్య నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు. ఈ కృత్రిమ గుండెకు లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ)గా నామకరణం చేశారు. వైద్య రంగంలో ఐఐటీ కాన్పూర్ చేసిన విశేష కృషిని చర్చించేందుకు తాజాగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే కృత్రిమ గుండె తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: