అహ్వానం అందింది


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. సినిమా టికెట్ల అంశంలో తన అభిప్రాయాలను ధైర్యంగా వినిపిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని వెల్లడించారు. సమావేశానికి రావాలంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని నుంచి ఆహ్వానం అందడం ఎంతో సంతోషం కలిగిస్తోందని వర్మ తెలిపారు. జనవరి 10న అమరావతి సచివాలయంలో తమ భేటీ ఉంటుందని వివరించారు. టికెట్ల ధరల అంశానికి సామరస్యపూర్వక పరిష్కారం కోసం అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునేందుకు చొరవచూపుతున్న పేర్ని నాని గారికి కృతజ్ఞతలు అంటూ వర్మ ట్వీట్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: