స్టాప్ నో యాక్షన్


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

బీజేపీ శ్రేణులకు ఊరాటనిచ్చే తీర్పును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెల్లడించింది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అర్వింద్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే కేసీఆర్ కార్టూన్ ఫొటోను ఇటీవల అర్వింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో సీఎంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు నమోదైంది. తప్పుడు ప్రచారం చేయడంతో సమాజంలో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు యత్నించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు కార్టూన్ ఫొటోను షేర్ చేయడం క్రిమినల్ చర్య కాదని పేర్కొంది. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: