సీఎం అభ్యర్థిగా  భగవంత్ మన్


వినూత్నంగా తమ పార్టీ పంజాబ్ సీఎం అభ‌ర్థిని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున భగవంత్ మన్ ఎంపికయ్యారు. మెజారిటీ ప్రజల ఆమోదం మేరకు ఆయన పేరును ఆప్ ఖరారు చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ ఎంపిక ఎవరో తెలియజేయాలని కోరుతూ పంజాబ్ లో ఆప్ సర్వే నిర్వహించింది. ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మెస్సేజ్ లు, ఫోన్ కాల్స్ రూపంలో ప్రజల అభిప్రాయాలను 17వ తేదీ సాయంత్రం వరకు స్వీకరించింది. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్వే ఫలితాలను మొహాలి వేదికగా వెల్లడించారు. మన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. వచ్చే నెల 20న పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలు ఆప్ కు అధికారం కట్టబెడితే ముఖ్యమంత్రి పదవిని మన్ అలంకరించనున్నారు. ప్రస్తుతం సంగ్రూర్ ఎంపీగా మన్ ఉన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: