చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు సవాల్ కు పెద్దిరెడ్డి ఘాటైన కౌంటర్ ఇస్తూ చంద్రబాబు ముందు ఊహించని ప్రతిపాదన ఉంచారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు.. చంద్రబాబుపై పోటీకి తాను అవసరం లేదని, తన అటెండర్ చాలంటూ ఎద్దేవా చేశారు. ఈసారి కుప్పంలో చంద్రబాబుపై అటెండర్‌ను పోటీకి పెట్టి ఓడిస్తానని మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో అటెండర్ ఎందుకు దమ్ముంటే నువ్వే వచ్చి పోటీ చేసి గెలిచి చూపించాలని ప్రతి సవాల్ విసిరారు. ఇద్దరు అగ్ర నేతల సవాళ్లతో చిత్తూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఒకవేళ పంతానికి పోయి చంద్రబాబు, పెద్దిరెడ్డి ఒకరిపై మరొకరు పోటీకి సై అంటే.. చిత్తూరు రాజకీయాలే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే వేడెక్కే అవకాశం ఉంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: