ఆ బెనిఫిట్ తో ఆ లోటు కనిపించదు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

పీఆర్సీ విషయంలో ఉద్యోగులకు న్యాయం జరగలేదని టీడీపీ విమర్శిస్తే ఉద్యోగ సంఘాలు మాత్రం సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ తో భేటీ అనంతరం ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తమకు 23 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిందని వెల్లడించారు. తెలంగాణతో పోల్చితే 7 శాతం తక్కువని అన్నారు. అయితే తాము తీసుకుంటున్న జీతాలతో పోల్చితే మెరుగైన విషయమేనని, తమకు పెండింగ్ లో ఉన్న 6 డీఏలను జనవరిలో ఇచ్చేస్తామని ప్రకటించారని, తద్వారా తమకు ఆ లోటు భర్తీ అవుతుందని వివరించారు. అందువల్ల ఫిట్ మెంట్ అంశంలో పెద్దగా బాధపడాల్సిందేమీలేదని బండి శ్రీనివాసరావు అన్నారు. జేఏసీ తరఫున సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణలో రిటైర్మెంట్ వయసు 61 సంవత్సరాలు ఉంటే, మన రాష్ట్రంలో 62 సంవత్సరాలు అని ప్రకటించారని వెల్లడించారు. ఈ అంశాన్ని తామెవరం డిమాండ్ చేయలేదని, ముఖ్యమంత్రి స్వయంగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రెండు సంవత్సరాలు పెంపుదల చేయడం సంతోషదాయకమని అన్నారు. ఐఆర్ లో 7 శాతం తగ్గినప్పటికీ, మిగతా అంశాల ద్వారా ప్రభుత్వం సర్దుబాటు చేస్తోంది కాబట్టే తాము సంతృప్తిగా ఉన్నామని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కూడా కొంత సహకరించాలన్న ఆలోచనతో కొన్ని అంశాల్లో తాము పట్టుదలకు పోలేదని స్పష్టం చేశారు. అయినా సంతృప్తికి హద్దు ఉండదని, ప్రస్తుత ప్రకటన నేపథ్యంలో తమ క్యాడర్ కు తాము నచ్చజెప్పుకుంటామని తెలిపారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: