అటు కరోనా...ఇటు విలయాలు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

అమెరికాను కరోనా..ఒమిక్రాన్ తోపాటు ప్రమాదపరమైన విలయాలు  సంభవిస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిలడెల్పియాలో గల మూడు అంతస్తుల భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో 13 మంది చనిపోయారు. వీరిలో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక సిబ్బంది అంటున్నారు. ఇద్దరిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు. తన 35 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదం చూడలేదని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటివరకు తెలియరాలేదు. దీనిపై విచారణ జరుగుతుందని తెలిపారు. భవనంలో నాలుగు స్మోక్ డిటెక్టర్లు ఉన్నాయి.. కానీ అవీ పనిచేయడం లేదని తెలిపారు. భవనం ఫిలడెల్పియా పబ్లిక్ హౌసింగ్ అథారిటీకి చెందినది. భవనంలో గల రెండో అంతస్తు నుంచి మంటలు వ్యాపించాయి. తొలుత పొగ వచ్చింది. భవనంలో 26 మంది ఉంటున్నారు. 8 మంది ఫస్ట్ ప్లోర్.. 18 మంది సెకండ్, మూడో ప్లోర్‌లో ఉంటున్నారు. ప్రమాదం జరిగే సమయానికి ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు. మంటలు రావడంతో చుట్టు పక్కల వారు భయపడ్డారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: