దానితో నాకేం సంబంధం:అల్లు శిరీష్


చాలా మంది ఆహాలో ఏదైనా స‌మ‌స్య‌ వస్తే సోషల్ మీడియాలో త‌న‌ను ట్యాగ్ చేస్తున్నారని, చాలా మంది తాను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యానని అనుకుంటున్నారని చెప్పాడు. దానితో నాకు సంబంధంలేదన్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా' ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ది అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడు అల్లు అర్జున్ ఈ ప్లాట్‌ఫాంకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నాడు. మ‌రో కుమారుడు, సినీ హీరో శిరీష్ మాత్రం 'ఆహా'కు, త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ చేసిన ట్వీట్ అభిమానుల్లో చ‌ర్చ‌కు దారితీసింది. 'ఆహా' సబ్‌స్రైబర్లు ఆ యాప్‌లో ఏమైన సమస్యలు వ‌స్తే ట్వీట్లు చేస్తున్నారు. తాను ఆ యాప్‌లో సాంకేతిక‌ సమస్యలను ఎదుర్కొంటున్నామ‌ని చెబుతూ ఓ వ్య‌క్తి తాజాగా ట్వీట్ చేశారు. ఈ స‌మ‌స్య‌ల‌ను వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆహా వీడియోస్‌ టీం, అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లను ట్యాగ్ చేశాడు. దీంతో ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన శిరీష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. చాలా మంది ఆహాలో ఏదైనా స‌మ‌స్య‌ వస్తే సోషల్ మీడియాలో త‌న‌ను ట్యాగ్ చేస్తున్నారని, చాలా మంది తాను ఆహా బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యానని అనుకుంటున్నారని చెప్పాడు. వినియోగ‌దారుల‌కు సంబంధించిన‌ ఇటువంటి స‌మ‌స్య‌ల‌ను 'ఆహా' టీం ప‌రిష్క‌రించాలంటూ శిరీష్ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అల్లు అర్జున్ అభిమానులు హ‌ర్ట్ అవుతూ పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్ త‌మ్ముడే అయ్యుండి, ఆహాతో ఎటువంటి సంబంధం లేదంటూ ఇటువంటి ట్వీట్ ఎందుకు చేశావ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఆహాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా అల్లు అర్జున్ ఉంటే శిరీష్ మాత్రం దానికి ఎందుకు దూరంగా ఉంటున్నాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. త‌న‌కు ఆహాకు ఎలాంటి సంబంధ‌మూ లేద‌న్నట్లు శిరీష్ చేసిన ట్వీట్ తో ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నాయా? అనే అనేక అనుమానాల‌ను నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: