నిధి అగర్వాల్...భారీగానే నిధి పట్టేసింది


హీరో సినిమాలో నట్టించేందుకు నిధి అగర్వాల్ భారీగానే నిధి పట్టేసిందని తెలుస్తోంది. టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో నిధి అగర్వాల్ ఒకరు. 'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీకి ఆదిలోనే నిరాశ ఎదురైంది. ఆ తరువాత చేసిన 'మిస్టర్ మజ్ను' కూడా పరాజయాల జాబితాలో చేరిపోయింది. 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ కొట్టేసిన ఈ సుందరి, కోలీవుడ్ పై పట్టుసాధించడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిధి అగర్వాల్ కి 'హీరో' సినిమాలో అవకాశం రావడం జరిగింది. గల్లా అశోక్ హీరోగా చేసిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. ఇంతకుముందు సినిమాకి 50 నుంచి 80 లక్షల వరకూ పారితోషికంగా తీసుకున్న నిధి, ఈ సినిమా కోసం కోటిన్నర తీసుకుందని చెప్పుకుంటున్నారు. పవన్ సినిమా 'హరి హర వీరమల్లు' ఆమె చేతిలో ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. ఇక 'హీరో' సినిమా సంగతి అలా ఉంచితే, ఈ సినిమా ప్రమోషన్స్ తోనే నిధి క్రేజ్ పెరిగిపోయింది. మళ్లీ జన్మంటూ ఉంటే నిధి అగర్వాల్ గా పుట్టాలని నరేశ్ అంటే, తెరపై ఆమెను చూసిన తరువాత తనకి మళ్లీ హీరోగా చేయాలనిపించింది అని జగపతిబాబు అన్నారు. ఇక 'వీరమల్లు' తరువాత నిధి పారితోషికం మరింత పెరిగినా ఆశ్చర్యం లేదేమో!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: