'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదలపై... సెటైర్లు వేస్తున్నారు


(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

రాజమౌళి సినిమా రూపొందిస్తే అది ఎపుడు రిలీజ్ చేస్తారా అన్న ఉత్కంఠ ఉంటుంది. కానీ ఆలస్యం కూడా విషమంగా మారుతుందన్నది తెలుసుకోవాలి. ఈ నేపథ్యంంలో ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలపై సినిమా అభిమానులు వినూత్నంగా సెటైర్లు వేస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' విడుదల అనుకున్న స‌మయానికి జ‌రిగితే ఈ రోజు దేశం మొత్తం ఆ సినిమా నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగిపోయేద‌ని నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తున్నారు. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ‌ని చెప్పిన ఆర్ఆర్ఆర్ నిర్మాత‌లు చివ‌ర‌కు దాన్ని వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో ఈ సినిమా నిన్న విడుద‌ల కాలేక‌పోయింది. సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ఆశ‌గా ఎదురుచూసిన అభిమానులు తీవ్ర నిరాశ‌ను ఎవ‌రితో చెప్పుకోవాలో కూడా అర్థం కాక‌ సామాజిక మాధ్య‌మాల్లో మీమ్స్ రూపంలో త‌మ క్రియేటివిటీతో అభిప్రాయాలు పంచుకుంటున్నారు. 'ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల అయ్యేలోపు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వృద్ధులు అయిపోతారంటూ కొందరు సృష్టించిన పోస్టులు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. 50 ఏళ్ల త‌ర్వాత విడుద‌ల చేసే సినిమా షూటింగ్‌ను ఇప్పుడే తీసి పెట్టుకోవ‌డం ఎందుకంటూ నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంత‌కు ముందు బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడ‌న్న టెన్ష‌న్ ను ప్రేక్ష‌కుల్లో ఉంచి చంపేసిన రాజ‌మౌళి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విడుద‌ల ఎప్పుడ‌న్న టెన్ష‌న్లో ఉంచాడ‌ని చుర‌క‌లంటిస్తున్నారు.

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: