అందుబాటులోకి 'మోహన్ బాబు యూనివర్శిటీ'


(జానో జాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

'మోహన్ బాబు యూనివర్శిటీ' అందుబాటులోకి రానున్నది. ఈ విషయాన్ని సినీ నటుడు మోహన్ బాబు స్వయంగా ప్రకటించారు. యూనివర్శిటీని స్థాపించాలన్న తన సుదీర్ఘ కల నెరవేరిందని సినీ నటుడు మోహన్ బాబు తెలిపారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, తన అభిమానుల ప్రేమాభిమానాలతో 'మోహన్ బాబు యూనివర్శిటీ'ని ప్రారంభిస్తున్నానని సవినయంగా ప్రకటిస్తున్నానని ఆయన చెప్పారు. శ్రీ విద్యానికేతన్ లో తాము వేసిన విత్తనాలు కల్పవృక్షంగా మారాయని తెలిపారు. 30 ఏళ్ల మీ నమ్మకం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్నమైన అభ్యాస విశ్వంలోకి చేరుకుందని చెప్పారు. ఎంతో కృతజ్ఞతతో మీ అందరికీ తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీని అందిస్తున్నానని తెలిపారు. మీ అందరి ప్రేమే తన బలమని... తన ఈ కలకు కూడా మీరందరూ మద్దతుగా ఉంటారని విశ్వసిస్తున్నానని చెప్పారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: