ప్రయాణంపై నిబంధనలు: ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

దేశంలో కరోనా వ్యాప్తి చెందింది ఎక్కువ రవాణ సాధనాల ద్వారానే. అందుకే తాజాగా ఎపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకొంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో  ఈ నిర్ణయం ఆర్టీసీ తీసుకొంది. ఇదిలావుంటే  గత 24 గంటల్లో ఏకంగా 1,79,723 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బస్ ఎక్కే ప్రయాణికులకు రూ. 50 జరిమానా విధించనున్నారు. టికెట్ ధరతో పాటు ఈ జరిమానాను కూడా టికెట్ రూపంలో ఇవ్వనున్నారు. కండక్టర్ల వద్ద ఉండే టికెట్ మిషన్లలో కూడా ఇప్పటికే ఈ రూ. 50 జరిమానాను అప్ డేట్ చేశారు. ఫైన్ బటన్ నొక్కగానే రూ. 50 జరిమానా టికెట్ వస్తుంది. ఆర్టీసీ బస్సుల ద్వారా కరోనా వ్యాప్తి జరగకూడదనే జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ జరిమానా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: