మీ అభ్యర్థి ఎలాంటి వాడో మీరు తెలుసుకోవచ్చు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

అసెంబ్లీ ఎన్నికల్లో నేర చరిత్ర గల అభ్యర్థుల వివరాలను ఆయా పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాలని సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. దీన్ని తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. నేర చరిత్ర గల వారిని ఎన్నికల్లో ఎందుకు అభ్యర్థిగా నిలబెట్టాల్సి వచ్చిందనే విషయంపై కూడా రాజకీయ పార్టీలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నేర చరితులను ఎన్నికల్లో నిలబెట్టిన ప్రతి రాజకీయ పార్టీ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని అన్నారు. ఆ అభ్యర్థిపై ఎన్ని క్రిమినల్ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయనేది వెల్లడించాలని, ఏ ప్రయోజనంతో వారిని నిలబెట్టారో ఓటర్లకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదేనని ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలను నివారించడానికి సీవిజిల్ యాప్‌ను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటర్ కూడా తాను వినియోగించే స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అయిదు రాష్ట్రాల్లో విడతలవారీగా పోలింగ్‌ను నిర్వహించేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: