నవ సమాజ స్థాపనకు,,

అబ్దుల్లా జావిద్ యూట్యూబ్ ఛానల్  కృషి అభినందనీయం


(జానో జాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

అబ్దుల్లా జావిద్ యూట్యూబ్ ఛానల్ లో నాలుగో తరగతి విద్యార్థిని సమ్రహ్ సరూష్ పట్టించిన దివ్యఖుర్ఆన్ లోని అల్ ముల్క్ సురాః ను జమాతే ఇస్లామీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ఇలియాస్ ఆవిష్కరించారు.   ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా సమాజంలో నెలకొన్నరుగ్మత లను దూరం చేయడానికి, నవ సమాజ స్థాపనకు, నైతిక విలువలను పెంపొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.నేటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా నైతికతలతో కూడిన వీడియోలు రూపొందించి పెద్దలలో మరియు పిల్లలలో చైతన్యం తీసుకు వస్తున్న అబ్దుల్లా జావిద్ యూట్యూబ్ ఛానల్  కృషిని ప్రత్యేకంగా అభినందించారు.  రానున్న రోజుల్లో మరిన్ని నైతిక విలువలు పెంపొదించే వీడియోలు తీయాలని ఆయన ఆకాంక్షించారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: