ఉపాధ్యాయ, ఉద్యోగుల ఉద్యమాలు,,

ఎందుకు బలహీనపడుతున్నాయి...?


సంప్రదాయ పార్టీలపై వ్యక్తిగత అభిమానం, నాయకులపై వ్యక్తిగత ఆరాధన వున్నప్పుడు ఎటువంటి మంచి ఫలితాలు రావు..ఒక రాజకీయ పార్టీని గెలిపించడానికి ఉపాధ్యాయ,ఉద్యోగులు శ్రమ పడనవసరం లేదు.కొందరు ఉద్యోగ,ఉపాధ్యాయులు రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు.వారు చూపే వ్యక్తిగత అభిమానం వల్ల ఉద్యమాలకు దూరంగా ఉంటున్నారు. రాజ్యాంగం ప్రకారం ఉద్యోగులకు పాలకులు కనీస సౌకర్యాలు కల్పించాలి.అది వారి బాధ్యత.అందుకు వారికి క్షీరాభిషేకాలు చేయనవసరం లేదు. ఒక్కోసారి ఎన్ని ఉద్యమాలు చేసినా మనం ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.ఉదాహరణకు తెలంగాణలో గతంలో ఆర్ టీ సి కార్మికులు చేసిన ఉద్యమం. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వాలే పనిగట్టుకుని ఉద్యోగులకి జీతాలు ఎక్కువ ఇస్తున్నాం అని చెప్తున్నాయి.ఉద్యోగుల ఓట్లు తక్కువ. వీరితో లాభం లేదు అని వారి భావిస్తున్నారు. రెండవది అత్యధిక మంది ఉద్యోగులు వివిధ కారణాలతో తమ ఓటుహక్కుని వినియోగించుకోలేకపోతున్నారు. ఎన్నికల డ్యూటీలో ఉండటం ఒక కారణం కావచ్చు. పోస్టల్ బ్యాలెట్ లో ఓటు ఎవరికి వేశామో తెలియడం మరొక కారణం.(ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో) 4.గతంతో పోల్చితే పనిభారం పెరిగింది. శలవు రోజులలో కూడా పనిభారం ఉంటుంది. ఎక్కువ మంది భార్యా భర్తలు ఉద్యోగులుగా వున్నారు.


వీరిలో కొందరు వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యమాలకు రావడం లేదు.ఇంకొందరు వచ్చే జీతం సరిపోతుందని భావిస్తుండవచ్చు.గతంతో పోల్చితే ఉద్యగుల సంఖ్య కూడాతగ్గింది.ఆర్థిక విధానాలు ఇందుకు కారణం అని చెప్పవచ్చు.  గతంతో పోల్చితే చాలా విషయాలపై ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు యాప్స్ గురించి కూడా.ఇప్పుడు ఉద్యమాల చేసేవారిపై నిఘా పెరిగింది. ఇందువల్ల కొంతమంది భయపడుతున్నారు. గత రెండు ఏళ్ల నుంచి కరోనాఉంది.చాలా మంది ఉపాధ్యాయులు చనిపోయారు.కొందరు కరోనా కారణంగా బయటకు రావడం లేదు.  గతంలో ఉద్యమాలకు ప్రభుత్వాలుభయపడేవి.చర్చలు జరిపేవి.అప్పట్లో ఎన్నికల సమయంలో ఉద్యోగులే కీలక పాత్ర పోషించేవారు.ఇప్పుడు వారు గెలవడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వివిధ రకాల కారణాల వల్ల ఉద్యోగుల ఉద్యమాలకు ఇతర వర్గాల నుంచి తగినంత మద్దతు లభించడం లేదు. సహజంగా అత్యధిక మంది ప్రజలలో ఉద్యోగుల పట్ల నెగెటివ్ అభిప్రాయం ఉంటుంది.ఉద్యోగులకు జీతాలు ఎక్కవనే అభిప్రాయం వారిలో వుంది. ఇందుకు ప్రభుత్వాల ప్రచారం కూడా ఒక కారణం కావచ్చు. కొన్ని శాఖల్లో పేరుకుపోయిన అవినీతి కూడా మరొక కారణం కావచ్చు. పాఠాలు సక్రమంగా చెప్పకపోవడం అనేది కూడా అవినీతికి క్రిందకే వస్తుంది.ఇక కొంతమంది నాయకులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం ఇంకొక కారణం.ఐక్య కార్యచరణ లేకపోవడంతో పాలకులు తమ ఎత్తుగడలతో ఉద్యమాలని నీరుగారుస్తున్నారు. ఇప్పుడున్న కొత్త ఉద్యోగులలో చాలామందిలో ఉద్యమ స్ఫూర్తి తగ్గడం మరొక కారణం.*

 ఏం చేయాలి...?

నూతన ఉద్యోగులకి దిశా నిర్ధేశం చేయాలి. ఉద్యోగ,ఉపాధ్యాయులు ప్రజా సంఘాలతో మరింతగా మమేకం అవ్వాలి. సంప్రదాయంగా జరిపే ఉద్యమాలతో పాటుగా, బలమయిన ఉద్యమాల నిర్మాణానికి కొత్త మార్గాలు ఎంచుకోవాలి. అందుకు తగినంత సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించాలి. కొత్త తరానికి ఉద్యమ సాహిత్యంపై అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయ ఉద్యోగులు ఇంకాస్త ప్రజలతో మమేకం అయితే వారినుండి కూడా మద్దతు లభిస్తుంది.

ఇప్పటికీ అనేకమంది ఉద్యోగ,ఉపాధ్యాయులు కష్ట పడిపనిచేస్తున్నారు. అనేకమంది నాయకులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ పోరాటాలు చేస్తున్నారు.వీరిని స్ఫూర్తిగా తీసుకుని అటు విధి నిర్వహణలో, ఇటు పోరాటాలలోనూ సత్తాను చాటాల్సిన అవసరం నేటి తరంపై ఉంది.

 

రచయిత-యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 


 


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: