పాటలు పాడుతూ, తమకు మాటలు రాస్తున్నది ఎవరు


(జానో జాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

బాబూ టీడీపీకి పాటలు పాడుతూ, తమకు మాటలు రాస్తున్నది ఎవరు?' అని వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల విష‌యంలో వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సినిమా వాళ్ల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప‌లు వ్యాఖ్య‌లు చేశారంటూ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 'సినిమా వాళ్లు తనకెప్పుడూ వ్యతిరేకమేనని కామెడీ చేస్తున్నాడు చంద్రబాబు. గోదావరి పుష్కరాల షూటింగ్స్ నుంచి అమరావతి గ్రాఫిక్స్ వరకు చేసిందెవరు? సినిమా వాళ్లతో తమ లింక్స్ అందరికీ తెలిసిందే కదా బాబూ. టీడీపీకి పాటలు పాడుతూ, తమకు మాటలు రాస్తున్నది ఎవరు?' అని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: