కరోనాను కట్టడి చేసేదెలా: అధికార్లతో పీఎం భేటీ నేడు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

రోజు రోజుకు విస్తరిన్న కరోనా వైరస్ నేపథ్యంలో వాటి కట్టడిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధికార్లతో సమావేశానికి సమాయత్తమవుతున్నారు. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఉన్నతాధికారులతో కరోనా మహమ్మారిపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. గడిచిన వారం రోజుల్లో కరోనా కేసులు 20వేల నుంచి 1.6 లక్షలకు పెరిగిపోయిన నేపథ్యంలో ప్రధాని సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధాని చివరిగా గతేడాది డిసెంబర్ 24న కరోనాపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండడం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. గతంతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తో కేసులు గణనీయంగా పెరుగుతున్న క్రమంలో ప్రధాని మోదీ అధికారులకు పటిష్ట కార్యాచరణను నిర్ధేశించనున్నారు. రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేసే అవకాశం ఉంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: