ముద్ర రుణంతో...మీ భవిష్యత్తుకు బాటలు 


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

స్వయం ఉపాధి దిశగా దేశ ప్రజలను ప్రోత్స హించేందుకే కేంద్ర ప్రభుత్వంం ముద్రా లోన్ ను తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో ముద్రా స్కీమ్ కూడా ఒకటి. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద అర్హత కలిగిన వారికి సులభంగానే రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది. అయితే ఇందులో పలు రకాలు ఉంటాయి. శిశు లోన్, కిశోర్ లోన్, తరుణ్ లోన్ అనే మూడు విభాగాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు తీసుకునే రుణం ప్రాతిపదికన ఏ విభాగంలో ఉంటారో తెలుసుకోవచ్చు.

కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నా లేదంటే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నా.. ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందొచ్చు. శిశు లోన్ కింద రూ.50 వేల వరకు లోన్ వస్తుంది. అలాగే కిశోర్ లోన్ కింద అయితే రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇక తరుణ్ లోన్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణం వస్తుంది. అందువల్ల వల్ల మీరు ఏ విభాగంలో రుణం పొందాలని భావిస్తున్నారో నిర్ణయించుకోవాలి. తర్వాత ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అవసరమైన లోన్ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకొని ఫిల్ చేసి బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ క్షేత్ర స్థాయిలో బ్యాంక్ ఉద్యోగులు అర్హత కలిగిన కస్టమర్ల విషయంలో రుణం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. బ్యాంక్ జీఎంలకు, ఏజీఎంలకు, డీజీఎంలకు ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే మీరు ఆన్‌లైన్‌లోనే నేరుగా అప్లికేషన్ సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. దీని కోసం మీరు https://www.psbloansin59minutes.com/mudra-loan వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ముద్రా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. జీఎస్‌టీ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఓనర్ వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. వెంటనే సూత్రప్రాయ ఆమోదం లభిస్తుంది. తర్వాత బ్యాంక్‌కు వెళ్లి డాక్యుమెంట్లు సమర్పించి లోన్ పొందొచ్చు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: