పోలీస్ అధికారి పాత్రలో...రామ్ కొత్త చిత్రం 'ది వారియర్'


పోలీస్ అధికారి పాత్రలో కొత్త చిత్రం 'ది వారియర్' లో హీరో రామ్ నట్టించనున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో వచ్చిన మాస్ ఇమేజ్ తో, రామ్ అటు క్లాస్ టచ్ .. ఇటు మాస్ టచ్ ఇస్తూ 'రెడ్' సినిమా చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో మళ్లీ పూర్తిస్థాయి మాస్ యాక్షన్ కథనే రామ్ ఎంచుకున్నాడు. దర్శకుడు లింగుసామి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రంగంలోకి దిగాడు. 'రెడ్' తరువాత పెద్దగా గ్యాప్ లేకుండా రామ్ ఈ సినిమాను ఎనౌన్స్ చేసినప్పటికీ, కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి 'ది వారియర్' అనే టైటిల్ ను ఖరారు చేసి, రామ్, ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ గా సీరియస్ లుక్ తో కనిపిస్తూ ఫస్టులుక్ తోనే రామ్ అదరగొట్టేశాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'ఉప్పెన' .. 'శ్యామ్ సింగ రాయ్' .. 'బంగార్రాజు'లతో కృతి శెట్టి వరుస హిట్లు కొట్టడం, ఈ సినిమాకి ప్లస్ కానుంది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: