మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వబోమని మళ్లీ బీజేపీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ స్పష్టంచేశారు. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనడానికి తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేయబోతోన్నామని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఈ అయిదేళ్లలో చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు ప్రతిపక్షాలకు లేదని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. 350 స్థానాలను తాము గెలవబోతోన్నామని పునరుద్ఘాటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం.. ఉత్తర ప్రదేశ్‌కు ఎంతో చేసిందని గుర్తు చేశారు. వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజలే తమను గెలిపించుకుంటారని అన్నారు. అధికారంలోకి వస్తే.. తాము ఏం చేయాలో చెప్పుకొనే పరిస్థితి కూడా ప్రతిపక్షాలకు లేదని యోగి చెప్పారు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు మళ్లీ తమకే అధికారాన్ని అప్పగిస్తారనే విశ్వాసం తనకు ఉందని యోగి ఆదిత్యనాథ్ తేల్చి చెప్పారు. అయిదేళ్లల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్గదర్శకంలో, ఆయన నాయకత్వంలో ఉత్తర ప్రదేశ్ సరికొత్తగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును తాము కార్యరూపంలోకి తీసుకొచ్చామని చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించామని అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: