ర‌ష్యాలో పెరిగిన మ‌ర‌ణాలు

(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)


రష్యా దేశం మరోసారి కరోనా మరణాలతో వణికిపోతోంది. స్పెయిన్‌లో మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న (బుధవారం) ఒక్కరోజే 1,37,180 మందికి వైరస్‌ సోకింది. 148మంది మరణించారు. 10,836 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రష్యాలో 15,772 కొత్త కేసులు రాగా 828 మంది మృతి చెందారు. అమెరికా తర్వాత అత్యధికంగా మృతుల సంఖ్య రష్యాలోనే నమోదయ్యాయి. ఇటలీలో కొత్తగా 1, 89,109 మందికి కరోనా సోకింది. 183 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో బుధవారం రికార్డు స్థాయిలో 11,978 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి వలనే కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు కరోనా, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరగడంలో హాంకాంగ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. పలుదేశాలపై విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. భారత్ సహా మొత్తం ఎనిమిది దేశాల నుంచి విమానాలను నిషేధిస్తున్నట్లు హాంకాంగ్ ప్రకటించింది. ఈ ఆంక్షలు జనవరి 21 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. హాంకాంగ్ నిషేధం విధించిన జాబితాలో అమెరికా, బ్రిటన్, ప్రాన్స్ , కెనడా, ఆస్ట్రేలియా, భారత్ , పాకిస్థాన్ దేశాలు ఉన్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: