జై భీం నినాద సృష్టికర్త హరదాస్


నినాదాలు మనలో ఉత్తేజాన్ని నింపుతాయి. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో అనేక నినాదాలు పౌరుల్లో దేశభక్తిని పెంచడానికి దోహదపడ్డాయి.మరికొన్ని నినాదాలు సమస్యల పరిష్కార సాధనకు,పోరాడటానికి, ఒకరినొకరు పలకరించుకోవడానికి ఉపయోగపడతాయి.అందులో జై భీం నినాదం ఒకటి.

 ముందుగా దాని వెనక ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి.ఆయనే...బాబు. ఎల్. ఎన్. హరదాస్.1936లో ఆయన ఈ నినాదాన్ని ఉపయోగించారు. "మనిషి జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉండాలి" అన్న బాబాసాహెబ్ మాటలకు నిలువెత్తు నిదర్శనం .. తాను బ్రతికిన 35 సంవత్సరాల అతి తక్కువ జీవిత కాలంలో దళిత ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన నిజమైన అంబేద్కర్ అనుచరుడు" జై భీం సినిమా విడుదల అనంతరం


ఈ నినాదం ప్రజలకు మరింత చేరువైంది. 17వ ఏట దళితుల సమస్యల చర్చించడానికి "మహారథ" పత్రిక స్థాపించి, తన 18వ ఏట దళితుల మీద జరుగుతున్న దాడులనుండి ఆత్మరక్షణ కోసం మహర్ యువకులతో "మహర్ సమాజ్ పాతక్" అనే స్వఛ్చంద దళాన్ని ఏర్పాటు చేసిన మహార్ వీరుడు. దళితులకు విద్య అంటే చాలా కష్టమైన ఆ రోజుల్లోనే మెట్రికులేషన్ పూర్తి చేసి, "రాత్రి బడులు" "చోకమేళ లైబ్రరీలు" తెరిచి దళితుల, మహిళల విధ్య కోసం కృషి చేసారు.. దళిత కార్మికులు అధికంగా ఉన్న బిడీ ఫ్యాక్టరీలలో మోసాలకు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులను వ్యవస్థీకృతం చేసేందుకు


"బీడీ కార్మిక్ సంఘ్" పేరుతో సహకార వ్యవస్థను ఏర్పాటు చేసిన కార్మిక నాయకుడు.స్వయంగా ఆయన రచయిత.బాలవీరక్ వంటి రచనలు చేశారు.1920లో  ఆయన సాహుబాయిని వివాహం చేసుకున్నారు. దళితులు కులాలుగా విడిపోయి ఉండడాన్ని వ్యతిరేకిస్తూ తరచూ సామూహిక భోజనాలు ఏర్పాటు చేస్తూ, ప్రతి సంవత్సరం "సంత్ చోకమేళ"(14వ శతాబ్దాపు దళిత సాధువు) జయంతి నాడు దళితుల సామూహిక కార్యక్రమాలు నిర్వహించిన ఐక్యతావాది.ఐక్య కార్యాచరణ ద్వారానే అణగారిన వర్గాల వారు హక్కులు సాధించు కోగలరని తెలిపారు. బాబాసాహెబ్ ఆలోచనా విధానాలతో అత్యంత ప్రభావితం అయిన హరదాస్ తదుపరి కాలంలో ఆయన చేసిన ప్రతి ఉద్యమంలో వెన్నుదన్నుగా నిలిచారు. రెండవ రౌండు టేబిల్ సమావేశంలో(1930-31),  "బాబాసాహెబ్ మాత్రమే మా ప్రతినిధి" అంటూ దేశ నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల దళిత నాయకులతో 32 టెలిగ్రాముల, అప్పటి బ్రిటీషు ప్రధాని రామ్సే మెక్ డొనల్డ్ కు పంపేలా కృషి చేసారు. తరువాత జరిగిన పూనా ఒడంబడిక సమయంలో గాంధీతో జరిగిన చర్చల్లో కూడా ఈయన క్రియాశీల పాత్ర పోషించారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి చీఫ్ సెక్రటరీగా, సెంట్రల్ ప్రావిన్స్ మరియు బిరార్ ప్రాంతీయ ఇన్చార్జ్ గా పనిచేసిన ఈయన 1937 ఎన్నికల్లో   కాంప్టీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.తన 35వ ఏట, జనవరి 12, 1939 న వ్యాధి వలన తుదిశ్వాస విడిచారు. పీడిత కులాల ఉద్యమాలను కొత్తపుంతలు తొక్కించిన బాబాసాహెబ్ కే తమ విజయాలను ఆపాదించే క్రమంలో మాతృస్వామ్యాన్ని ప్రతిబింభించే విధంగా "జై రమా పత్ని" ని వాడదాం అని ప్రతిపాదించారు.. ఎన్నికల్లో గెలిచాక ఒకరినొకరు పలకరించుకుని అభినందనలు తెలుపుకునేందుకు ఈ పదాన్నే వాడేవారు. ఈ నినాద ప్రాచుర్యం కోసం ఆయన " భీమ్ విజయ్ సంఘ్" ఏర్పాటు చేసి ఆ పలకరింపు ఒక ఆనవాయితీగా అలవాటయ్యేందుకు కృషి చేసారు. జై భీమ్ అనగా పాళీ భాషలో " వివేకవంతుడా!" నీకు విజయం కలుగుగాక" అనే అర్థం కూడా ఉన్నది.చీకటి నుండి వెలుగులోకి అనే అర్ధం లో కూడా ఈ నినాదాన్ని ఉపయోగిస్తారు. పీడిత కులాల ఉద్యమాలకు ఒక తిరుగులేని ఆత్మ గౌరవ నినాదాన్ని అందించిన బాబు హరదాస్ ని నిత్యం స్మరించుకుందాం.

 

రచయిత-యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: