దిగొస్తున్న ఛార్జీలు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా కారణంగానో ఇంకోటే విమాన ఛార్జీలు దిగివస్తున్నాయి. విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రీజనల్ కనెక్టివిటీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని విమాన మార్గాలలో విధించే పన్నులు, ప్రభుత్వ గ్రాంట్లు దీనిలో కలిసి ఉంటాయి. ఉడాన్ షరతులు పాటించనందకు జప్తు చేసే బ్యాంకు గ్యారెంటీలు కూడా ఈ ఫండ్‌లోకే వెళ్తాయి. డిపాజిట్లపై వడ్డీ ఆదాయం కూడా ఈ ఫండ్‌లోనికే జమ చేస్తుంది. అయితే ఈ ట్రస్ట్ ఫండ్‌ను ఉడాన్ కోసం కాకుండా మరే ఇతర అవసరాలకు వాడరు. జూన్ 1, 2020 నుంచి ఆర్థిక సంవత్సరం 2024-25 వరకు ఈ ఫండ్ వాలిడ్‌లో ఉంటుంది. ఈ ఫండ్‌తో విమాన టిక్కెట్ల ధరలు మరింత దిగి రానున్నాయి. ఉడాన్ కింద రీజనల్‌కు కూడా కనెక్టివిటీ మరింత పెరగనుందని విమానయాన పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: