నిబంధనలు గాలికి...కరోనా కట్టడి ఇలా ఐతే ఎలా సాధ్యం

సంతల్లో భౌతిక దూరం..మాస్క్ ధరించడం కనిపించండంలేదు

సంతలో అధికార్ల చేతివాటంపై బహిరంగంగా విమర్శలు...తూకాలపై పెట్టన నిఘా

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కరోనా కట్టడికి భౌతిక దూరం, మాస్క్ ధరించడం తప్పని సరి అని ప్రభుత్వం, అధికార్ల మొరపెట్టుకొంటున్నా ఆ సంతలో మాత్రం అది ఏ మాత్రం కనిపించడంలేదు. సంతకు వచ్చే వారి తీరు అలా ఉంటే కరోనా నిబంధనలు అమలు చేయాల్సిన వారి ఉదాసీన వైఖరి మరో వైపు సాధారణ జనాలకు భయం గుప్పిట్లో నెడుతోంది. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు కరనా సోకడానికి కారణం అవుతున్న వారం రోజు వారి సంతలపై అధికార్లు ప్రత్యేక నజర్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా, పాణ్యం నియోజవర్గం, గడివేముల మండల పరిధిలోని గ్రామాలలో ఏదో ఒక రోజు గ్రామాలలో కూరగాయలను రహదారులకు ఇరువైపులా పేట్టి విక్రయాలు నిర్వహిస్తూ ఉంటారు.  కూరగాయలు కొనేందుకు వచ్చే వినియోగదారులు ప్రజలు సామాజిక దూరం పాటించకుండా, మాస్కూలు ధరించకుండా, చిన్న పిల్లలు సైతం తీసుకుని వచ్చి కూరగాయల క్రయ విక్రయాలు జరుపుతున్నారు. కూరగాయలు అమ్మే వారు మాస్కులు 


ధరించకుండా గవర్నమెంటు వారు ముద్రించిన 1 కేజీ, 2 కేజీలు అర్థ కేజీ ముద్రలు రాళ్లపై భూతద్దం పెట్టి వెతికినా కనిపించడంలేదు. ముద్రలు లేకుండానే క్రయ విక్రయాలు గడివేముల మండలంలో జరుగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పావు కేజీ రాళ్లు ను ఎలాంటి ప్రమాణికం లేని రాళ్లతో తూకం వేసి విక్రయదారులు వారికి ఇష్టం వచ్చిన రీతిలో అమ్మకాలు జరుపుతున్నా

వాటిని పరిశీలించాల్సిన అధికార్లు మాత్రం చూస్తూ  చోద్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నారు. విక్రయదారులను కట్టడి చేయవలసినటువంటి అధికారులు మాత్రం వారికి కావలసిన సొమ్మును తీసుకొని తూతూ మంత్రంగా తనిఖీలు చేసి వెళ్ళిపోతున్నారని, వ్యాపారుల పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో బహిరంగ చర్చలే సాగుతున్నాయి.


కూరగాయలు అమ్ముకునే వారు వారి వద్దనున్న సరుకులను అమ్ముకోవడానికి ప్రతి దుకాణం నుండి 50/-, రూపాయలు, 100/- రూపాయల నుండి 200 రూపాయల వరకు గ్రామ పంచాయతీ బోర్డు వారికి సరుకులను అమ్ముకోవడానికి డబ్బులు కడుతున్నామని, మా దగ్గర డబ్బులు తీసుకుని, గ్రామపంచాయతీ వారు ఎటువంటి రసీదులు ఇవ్వడం లేదని, కూరగాయలు అమ్ముకునేవారు, రైతు సోదరులు ఆరోపిస్తున్నారు, గడివేముల గ్రామంలోని సంతలో అమ్ముకునేందుకు గడివేమల, మండలంలోని ఇతర గ్రామాల నుండి  వచ్చి కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు మార్కెట్లో సరియైన సదుపాయం కూడా లేదని, రైతులు, రైతు కూలీలు,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: