నగరాలు మూత పడనున్నాయా


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా వైరస్ దూకుడు ప్రదర్శించడంతో దేశంలోని ప్రధాన నగరాలన్నీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ వచ్చే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్ర రూపాన్ని దాల్చింది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 1,16,836 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కరోనా మహమ్మారి విరుచుకుని పడటం ఏడు నెలల తరువాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. 3,52,25,699కి చేరాయి. అత్యధిక కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ 36,265 మంది కోవిడ్ బారిన పడ్డారు. దీని తరువాత పశ్చిమ బెంగాల్-15,421, ఢిల్లీ-15,097 నిలిచాయి. కర్ణాటక-5,031, కేరళ-4,649, గుజరాత్-4,213 మేర కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దీనితో ఆయా రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించే పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇవ్వాళ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ముంబైలో 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే..కంప్లీట్ లాక్‌డౌన్ విధిస్తామంటూ ఇదివరకే మేయర్ కిశోరీ పెడ్నేకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సంఖ్య దాటింది. ఆసియాలోనే అతి పెద్ద స్లమ్ ఏరియాగా పేరున్న ధారవిలోనూ మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. అనేక ప్రాంతాలను ఇప్పటికే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు. ఈ ప్రక్రియ మరింత ముమ్మరంగా సాగుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని- మహారాష్ట్ర ప్రభుత్వం.. సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కాకుండా.. ముంబై సహా కేసులు అత్యధిక సంఖ్యలో నమోదైన నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని భావిస్తోంది. ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె.. అధికారులతో వరుస సమీక్షా సమావేశాలను నిర్వహించారు. కోవిడ్‌ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చని ఆయన అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని సేకరించాల్సి ఉందని చెప్పారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రాథమికంగా చర్చించామని స్పష్టం చేశారు. తమ పరిధిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లకు ఇచ్చామని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: