రెడ్డి రాజుల సుపరిపాలన 


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

చరిత్రలో కొండవీడుకు అపూర్వవైభవముందని చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొండవీడు కోటను కేంద్రంగా చేసుకుని రెడ్డి రాజులు సుపరిపాలన అందించారని  ఆమె అన్నారు. వారి చరిత్ర భావితరాలకు తెలిసేలా కొండవీడు కోటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈరోజు కొండవీడులో అభివృద్ధి పనులకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో కలిసి రజని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొండవీడు ఘన చరిత్ర స్థానికులకు తెలుసని... ప్రపంచం మొత్తం కొండవీడు గురించి చర్చించుకునేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొండవీడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ రూ. 13.5 కోట్లను కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో కోటలో ఉన్న చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: