ఎన్టీఆర్ వర్ధంతి నాడే బాబుకు కరోనా ఎందుకు


చంద్రబాబు త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని జగన్ ఆకాంక్షించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలా చెబుతూనే ఆయన చంద్రబాబుపై వ్యంగ్యంగా కామెంట్లు  చేశారు. యాదృచ్ఛికమే అయినా ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకు కరోనా సోకడం బాధాకరమని ట్వీట్ చేశారు. బాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుందిలేగానీ టీడీపీ వ్యవస్థాపకుడికి ఆయన పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగుజాతి ఉన్నంత వరకూ గుర్తుండిపోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే తనకు కరోనా సోకిందని, లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నాయని పేర్కొంటూ చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే క్వారంటైన్ అయిన సంగతి తెలిసిందే. ఇటు ఆయన కుమారుడు నారా లోకేశ్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: