రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా భారిన పడిన వారి జాబితాలో ప్రముఖుల జాబితా పెరుగుతోంది. దేశంలో కేసులు కూడా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని, కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ ఐసోలేషన్ లో ఉండాలని, తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: