మా రక్తదాన శిభిరంతో వైరస్ విస్తరిస్తుందా


జనం గుమ్మిగూడటంతో వైరస్ వ్యాప్తిస్తుందన్న కారణంతో అలాంటి కార్యక్రమాలు రద్దు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ రక్తదాన శిభిరం నిర్వాహణకు అనుమతి నిరాకరించింది. దీంతో రక్తదాన నిర్వాహకులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కోవిడ్ కేసులు పెరుగుదలతో అన్ని రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కూడా కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. ప్రభుత్వం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు పెట్టింది. ప్రజలు గుంపులుగా చేరకూడదని, బహిరంగ ప్రదేశాల్లో తప్పని సరిగా మాస్క్ ధరించాలనే రూల్స్ ఉన్నాయి. మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై కూడా తెలంగాణ సర్కార్ నిషేధం విధించింది. ఈ క్రమంలో తలసేమియా రోగుల రక్తదాన శిబిరానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. పేషంట్ల పరిస్థితి బాగోలేదని బ్లడ్ క్యాంపుకు పర్మిషన్ ఇవ్వాలని ఆల్ ఇండియా మార్వాడీ యువ్ మంచ్ జిందగీ ఫౌండేషన్ కోరుతుంది. ఈ ఫౌండేషన్ జనవరి 26వ తేదీన శంషాబాద్ బస్టాండ్‌ దగ్గర మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్ పెట్టారు. కోవిడ్ ఆంక్షల కారణంగా పోలీసులు దీనికి అనుమతి ఇవ్వలేదు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: