పీఎంకు మెదక్ చిన్నారుల లేఖ


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

చదవుకోసం ఆ చిన్నారులు ఆరాటం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసేలా ప్రేరేపించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి 200 ఉత్త‌రాలు రాశారు 200 మంది మెద‌క్ చిన్నారులు. తాము చదవుకునేందుకు త‌మ‌ జిల్లాలో ఓ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని వారు కోరారు. త‌మ‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని చెప్పారు. జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఉంటే త‌మ జీవితాలు బాగుప‌డుతాయ‌ని చెప్పారు. సుమారు 200 మంది విద్యార్థులంతా క‌లిసి పోస్టు కార్డు ద్వారా ప్రధానికి ఈ విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, న‌వోద‌య పాఠ‌శాల‌లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల‌ని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: