భూపాల్ టూ గడివేముల

ఉపాధి కోసం వలసొచ్చి...స్థానిక జీవన విధానంతో మమేకం

పనిముట్లను అమ్ముతున్న జితిన్, శాంతాబాయి 

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

మనిషి పుట్టుక ఎక్కడో గిట్టుక ఎక్కడ, జీవితం ఎక్కడ ఎవరో చెప్పలేరు. ఇది మన స్వతంత్ర భారతదేశం ఎవరు ఎక్కడైనా నా బ్రతకవచ్చు అని మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అని నిరూపణకు ఇదొక మచ్చుతునక. భూపాల్ రాష్ట్రం నుండి ఉపాధి కోసం దాదాపు పదిహేను మంది  స్వయం ఉపాధి కూలీలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, కర్నూలు జిల్లా ,పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలానికి వచ్చి ఇక్కడ వారు తయారు చేసే ఇనుప పనిముట్లను అమ్మి జీవనం గడుపుతున్నారు. ఇతర రాష్ట్రాల నుండి  ఆంధ్రరాష్ట్రానికి రావడానికి కారణమేమని పర్బత్,


బనానా సీన్ల, జితిన్, శాంతాబాయి, లను అడగగా వారు మాట్లాడుతూ భూపాల్ రాష్ట్రంలో వర్షాలు తక్కువగా పడతాయని, అక్కడ పంటలు సరిగా పండవని, భూపాల్ రాష్ట్రంలో గోధుమ పంట ఎక్కువగా పండిస్తారని,అందువల్ల మేము తయారు చేసిన ఇనుప పనిముట్లును రైతులు, రైతుకూలీలు ఎక్కువగా కొనుగోలు చేయరని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వర్షాలు బాగా పడతాయని, ఇక్కడ పండుతున్న ప్రధాన వంటలు వరి, పత్తి, మొక్కజొన్న,  తదితర పంటలు ఎక్కువగా పండుతాయని, అందువల్ల మేము తయారు చేసే కొడవలి, సుత్తి, గొడ్డలి, మచ్చు కత్తి,లాంటివి రైతులకు,రైతు కూలీలకు ఎక్కువగా ఉపయోగ పడతాయని, అందువల్ల మేము ఇక్కడకు వచ్చి తయారుచేసిన ఇనుప పనిముట్లకు గిరాకీ బాగా ఉంటుందని వాటిని అమ్మి జీవనం గడుపుతున్నామని,

 తయారుచేసి విక్రయిస్తున్న... ఇనుప పనిముట్లుఈ వృత్తిలో మేము దాదాపుగా 20 సంవత్సరముల నుండి ఇదే వృత్తిలో కొనసాగుతున్నామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలు రైతులకు చేతికి అందివచ్చే సమయంలో మేము ఇక్కడికి వచ్చి ఇనుప పనిముట్ల అయిన  కొడవలి, కత్తి, మచ్చు కత్తి,గొడ్డలి, వంటి పనిముట్లను వారి కళ్ల ఎదురుగా తయారు చేసి, వాటిని అమ్మి జీవనం కొనసాగిస్తున్నామని, వారు తెలిపారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: