అటు కరోనా దూకుడు...ఇటు వ్యాక్సినేషన స్పీడు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా వైరస్ దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ప్రజలకు టీకా అందించే విషయంలోనూ  మన కేంద్రం దూకుడు  ప్రదర్శిస్తోంది. భారత్ లో ధర్డ్ వేవ్ ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. ఓవైపు కోవిడ్ కేసులు, మరోవైపు ఓమిక్రాన్ కేసులు కల్లోలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ 150 కోట్ల వ్యాక్సినేషన్ మార్క్ దాటింది. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 150 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని వేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్మా, వేయించుకోకపోయినా ఓమిక్రాన్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో దక్షిణాఫ్రికా, చైనా, యూకే, బోట్స్ వానా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయెల్, టాంజానియా, ఘనా వంటి దేశాలున్నాయి. ఈ దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ విధించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. మరోవైపు భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. కోవిడ్ భయాల నేపథ్యంలో వ్యాక్సిన్లకు డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. ఇప్పటివరకూ తొలిడోస్ వేయించుకోని వారు ఇప్పుడు వ్యాక్సిన్లు వేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే రెండు డోసులు వేయించుకున్న వారు బూస్టర్ డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే టీనేజర్ల వ్యాక్సినేషన్ కు భారీ స్పందన లభిస్తోంది. కొన్ని రాష్ట్రాలు దాదాపు వందశాతం టీనేజర్ల వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తోంది. ఏపీ వంటి రాష్ట్రాల్లో సైతం టీనేజర్ల వ్యాక్సినేషన్ రికార్డులు సృష్టిస్తోంది. ఈ నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ వేసేందుకు కేంద్రం మార్గదర్శకాలు ప్రకటించింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: