షర్మిళ పార్టీతో నాకు సంబంధంలేదు: బ్రదర్ అనిల్


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ పొలిటికల్ బ్యూరో)

షర్మిల పార్టీకి, తనకు సంబంధం లేదని తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై.ఎస్.షర్మిళ భర్త బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. ఏపీలో ఆమె పార్టీ ఏర్పాటు గురించి తాను మాట్లాడనని ఆయన స్పష్టంచేశారరు. ఇదిలావుంటే తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీని స్థాపించిన వైయస్ షర్మిల తెలంగాణలో విస్త్రుతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె క్రమం తప్పకుండా విమర్శలు కురిపిస్తున్నారు. పాదయాత్రల ద్వారా, ధర్నాల ద్వారా ఆమె ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా ఆమె రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే ప్రచారం ఎక్కువవుతోంది. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు ఈ ప్రచారానికి మరింత బలాన్ని తీసుకొచ్చాయి. ఇదిలావుంటే వై.ఎస్.షర్మిళ భర్త బ్రదర్ అనిల్ విజయవాడకు వెళ్లారు. గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద మీడియా ఆయనను ఏపీలో షర్మిల పార్టీపై ప్రశ్నించగా... షర్మిల పార్టీకి, తనకు సంబంధం లేదని చెప్పారు. పార్టీ ఏర్పాటు గురించి తాను మాట్లాడనని తెలిపారు. విజయవాడలో చిన్న ఫంక్షన్ ఉండి వచ్చానని చెప్పారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: