తెలంగాణలో ఓ మాధిరి వర్షాలు: వాతావరణ శాఖ వెల్లడి


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

చలికాలంలో వర్షాలు కురవడం మనం చూస్తునే ఉన్నాం. తాజాగా మరోసారి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రాబోయే నాలుగు రోజులపాటు అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి బలంగా గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, వాయవ్య ప్రాంతాల్లో గాలుల్లో ఏర్పడిన అస్థిరత కారణంగా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. గత కొన్ని రోజులుగా వణికిస్తున్న చలి తీవ్రత కొంత తగ్గింది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి ఆరు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: