ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తాం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ నీలినీడలు నెలకొన్నాయి. ఇదిలావుంటే కరోనా సంక్షోభం కారణంగా గతేడాది టెన్త్ పరీక్షలు నిర్వహించలేకపోయిన ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ పరీక్షలు జరపాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వినుకొండలో మాట్లాడుతూ, మార్చిలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. సంక్రాంతి కల్లా సిలబస్ పూర్తిచేయాలని విద్యాసంస్థలకు నిర్దేశించారు. ఈసారి 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వివరించారు. ఇక 'అమ్మఒడి' మూడో విడత గురించి చెబుతూ, విద్యాసంవత్సరం ఆరంభంలో ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సంక్షేమ పథకాల అమలుకు వెనుకంజ వేయడంలేదని స్పష్టం చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: