అమర్ జవాన్ జ్యోతి ప్రపంచానికే ఆదర్శం 

కాంగ్రెస్ నేత జి నిరంజన్ 

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

ఢిల్లీలో అమర్ జవాన్ జ్యోతి ప్రపంచానికే ఆదర్శమని టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు జీ నిరంజన్ పేర్కొన్నారు. సౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇండియా గేట్ వద్ద ఉన్న అమర జవాన్ జ్యోతి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చూసి గర్వపడతారు. బాంగ్లాదేశ్ విజయానికి సూచికగా ఆ యుద్దము లో అమరులైన భారత సైనికుల స్మృతికి చిహ్నంగా 1972 జనవరి 26న ఇందిరా గాంధీ ఈ అమరజ్యోతి ని వెలిగించారు. బీజేపీ దమన నీతితో ఈ జ్యోతి ని ఇవాళ్టి నుంచి ఆర్పేందుకు కుట్ర చేస్తున్నారు. ఇందిరాగాంధి వెలిగించిన ఆ జ్యోతి మోడి కంటికి నలుసులా ఉన్నది కావున తొలగిస్తున్నారు. ఇందిరా గాంధీ ప్రాముఖ్యతను తొలగించేందుకు మోడీ ఇలాంటి దుర్మార్గనికి పాల్పడుతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమేణా ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల త్యాగాలను ప్రజలకు దూరం చేసేందుకు కుట్ర చేస్తూ వారి ప్రాముఖ్యతను తగ్గించేందుకు బీజేపీ , సంఘ్ కుట్ర చేస్తుంది. భవిష్యత్తులో మహాత్మాగాంధీ చిహ్నాలను కూడా చెరిపేసి నాథూరామ్ గోడ్సేను మహాత్ముడిగా భావి భారత నిర్మాతగా ప్రకటించినా ఆశ్చర్యము లేదు. ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఇందిరా గాంధీ చిహ్నాలను లేకుండా చేస్తున్నారు. భవిష్యత్ లో ప్రజలు మీ గుర్తులు లేకుండా చేస్తారు. అని ఆయన విమర్శించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: