గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల సమ్మె బాట

ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఈఓఆర్డీ కు వినతి పత్రం అందిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని గ్రామ వార్డు,సచివాలయ ఉద్యోగులు,పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 సహాయక ఉద్యోగులు, ఇంజనీరింగ్ సహాయక ఉద్యోగులు (అసిస్టెంట్లు), సంక్షేమ విద్య సహాయకులు, గ్రామ సర్వేయర్ గ్రేడ్ 3, మహిళా పోలీసు మరియు మహిళా శిశు సంక్షేమ సహాయ ఉద్యోగులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ హార్టికల్చర్ అసిస్టెంట్ సహాయకులు, పశుసంవర్ధక శాఖ సహాయకులు, గ్రామ అసిస్టెంట్లు సహాయకులు, విద్యుత్ శాఖ ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగులుగ్రేటు2 ఉద్యోగులు అందరూ విధులను బహిష్కరించి ధర్నా కార్యక్రమం నిర్వహించారు, అనంతరం ర్యాలీగా బయలుదేరి ఎమ్మార్వో కార్యాలయా కి చేరుకొని వారి వినతుల తో కూడిన పత్రాలను ఎమ్మార్వో నాగమణి గారికి, ఎంపీడీవో విజయ సింహా రెడ్డి గారికి, ఈ ఆర్డిఓ khalik భాషగారికి, షరతులతో కూడిన వినతి పత్రం అందజేశారు.


అనంతరం ఆరోగ్యమిత్ర ఏఎన్ఎమ్ సభ్యులు పాత్రికేయులతో మాట్లాడుతూ, 2008 జనవరి 22 వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగంలో చేరామని, అప్పటినుండి ఇప్పటివరకు మాకు రెగ్యులేషన్ పోస్టులు కల్పించలేదని 2008 నుండి 2019  వరకు మేము(11 సం) ఏన్ ఆర్ హెచ్ ఎం కింద కాంట్రాక్టు ఉద్యోగులు గా పని చేసామని 2019లో మా ఉద్యోగాలకు భద్రత ఉండదేమో అని గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగుల తో పాటు మేము కూడా పరీక్షలు రాసి మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ గా ఉద్యోగాల్లో చేరామని,

విధులు  బహిష్కరించి ధర్నా నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 


అయితే ఇప్పుడు మళ్లీ పరీక్షలు రాయాలి అని అంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసం అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మేము ఉద్యోగంలో 2008 లో చేరినప్పుడు మా వేతనాలు మూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని మూడు వేల రూపాయల వేతనాలకు మేము కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో బంధువులు, మిత్రులు, సొంత వారు కూడా భయపడి రాకపోవడంతో మేము మా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందరికి వచ్చి వారిని హోం ఐసొల్యూషన్సొ లో పెట్టి వారికి తగిన  వైద్య సేవలు అందించామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు  మమ్మల్ని రెగ్యులేషన్ ఉద్యోగులుగా గుర్తించాలని

విలేకరులతో మాట్లాడుతున్న ఆరోగ్య మిత్ర, ఏఎన్ఎంలు 


ఆరోగ్య మిత్ర, ఏఎన్ఎం సభ్యులు కోరుకుంటున్నారు. అనంతరం ఏపీ ఎస్పీ డీ సీ ఎల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మాట్లాడుతూ మేము గత పదహారు సంవత్సరాల నుంచి ఆపరేటర్స్ మరియు పోల్ టు పోల్ గా  కాంట్రాక్టు పద్ధతిలో 16  సంవత్సరాలుగా పర్మినెంటు చేస్తారనే ఉద్దేశంతో మేము ఉద్యోగాలు చేశాము, కానీ ఇప్పటివరకు మా ఉద్యోగులను పర్మినెంట్ చేయకుండా కాలయాపన చేస్తూనే ఉన్నారు, వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గారు సచివాలయ ఉద్యోగుల తో పాటు ఎనర్జీ స్టాటిస్టిక్స్ గ్రేడ్ 2 డిపార్ట్మెంట్ పెట్టిన టెస్టుల్లో మేము ఉత్తీర్ణులు అయ్యి ఉద్యోగాలు చేస్తున్నాము.జగన్ సీఎం అయిన తర్వాత మా విధి విధానాలు మారుతాయని ఎంతగానో నమ్మి సచివాలయంలో జేఎల్ఎం గా విధులు నిర్వహిస్తున్నారు, కానీ ఇంతవరకు రెగ్యులేషన్ ఉద్యోగస్తులుగా మమ్ములను గుర్తించలేదు, covid 19 విజృంభించిన సమయంలో విధి నిర్వహణలో ఎంతోమంది మా తోటి కార్మికులు జేఎల్ఎం ఎస్ లు చనిపోవడం జరిగింది, covid 19 సమయంలో మా విద్యుత్ సోదరులు అందరూ రాత్రనకా పగలనకా  ప్రజలకు, వైద్యులకు, ప్రభుత్వ సిబ్బందికి, విద్యుత్ అంతరాయం లేకుండా మనస్ఫూర్తిగా డ్యూటీ చేయడం జరిగింది. విధినిర్వహణలో చనిపోయిన విద్యుత్ సోదరులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని, మరియు చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని వినతుల తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: