బాలయ్య అరుదైన రికార్డ్


(జానో జాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

నట సింహ బాలయ్య అరుదైన రికార్డ్ సొంతం చేసుకొన్నారు. హీరోగా యాక్టింగ్  లోనే కాదు యాంకర్ గాను బాగా రాణిస్తున్నారు. ఇపుడు ఆ యాంకరింగే ఆయనకు అరుదైన రికార్డ్ తెచ్చిపెట్టింది. తనదైన శైలిలో సినీ తారలను ఇంటర్వ్యూ చేస్తూ స్టాప్ అన్నదే లేకుండా దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్’ రియాలిటీ షోతో అందరి మన్ననలనూ ఆయన అందుకుంటున్నారు. రియాలిటీ షోలు నిర్వహించిన జాబితాలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నానిలు ఉన్నారు. అయితే, బాలకృష్ణ అన్ స్టాపబుల్ కు మాత్రం ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. షోలో బాలకృష్ణ టైమింగ్, ఎనర్జీ, ఆహార్యాలతో అదరగొట్టేస్తున్నారు. అతిథులను ఆడిస్తూ, పాడిస్తూ సరదా సరదాగా షోను నడిపించేస్తున్నారు. అలాంటి ఈ షో ఇప్పుడు ఓ అరుదైన ఘనతను దక్కించుకుంది. ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) విడుదల చేసిన రేటింగ్స్ లో ఇది రికార్డ్ సాధించింది. గత ఏడాది నంబర్ 4 ప్రారంభమైన అన్ స్టాపబుల్ టాప్ 10 రియాలిటీ షోల జాబితాలో చోటు సంపాదించింది. ఐదో స్థానాన్ని దక్కించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రారంభమైన మూడు నెలల్లోనే లిస్టులో ఈ రియాలిటీ షో చోటు సంపాదించుకోవడం విశేషమని ఐఎండీబీ పేర్కొంది. ఇదిలావుంటే ఇంతటి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులకు ఆహా యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఏడు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్.. మరో మూడు ఎపిసోడ్లు అయ్యాక తొలి సీజన్ ను పూర్తి చేసుకుంటుందని చెబుతున్నారు. 8వ ఎపిసోడ్ లో భాగంగా ఇవాళ దగ్గుబాటి రానాను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారు. టాప్ టెన్ లో నిలిచిన ఇండియన్ రియాలిటీ షోలు వరుసగా షార్క్ ట్యాంక్ ఇండియా, బిగ్ బాస్ తెలుగు, బిగ్ బాస్, ఫాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్, అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే, ద బిగ్ పిక్చర్, ఇండియన్ మ్యాచ్ మేకింగ్, ఎంటీవీ రోడీస్, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోం కే ఖిలాడీ, డ్యాన్స్ ప్లస్.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: