రైతన్నను ముంచి.... దళారులు పరార్

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండల పరిధిలోని గని గ్రామంలో పంటలు పండించిన రైతుల వద్ద నుండి  దళారులు పంట దిగుబడులను కొనుగోలు చేసి రైతులకు నగదు చెల్లించకుండా వ్యాపారస్తులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే...గని గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ కుమార్, వేముల మల్లికార్జున,వేముల రవి కుమార్ అను ముగ్గురు అన్నదమ్ములు దాదాపుగా 12 సంవత్సరాల నుండి రైతులు  పండించిన పంటలను వారు కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారం చేసే వారని అలాగే


ఈ సంవత్సరం కూడా గని, మంచాలకట్ట గ్రామానికి చెందిన రైతుల వద్ద నుండి  మొక్కజొన్న, వడ్లు, పత్తి, మినుములు, మొదలగు పంట దిగుబడులను రైతుల వద్ద నుండి కొనుగోలు చేసుకొని రైతులకు డబ్బులు తరువాత ఇస్తామని చెప్పడంతో రైతులు అన్నదమ్ములైన వేముల లక్ష్మణ్ కుమార్,వేముల మల్లికార్జున,వేముల రవి కుమార్, ల పై నమ్మకంతో పంట దిగుబడులను వారికి ఇచ్చామని గని, మంచాలకట్ట గ్రామానికి చెందిన దాదాపు 30 మంది రైతులు తెలిపారు. అయితే వేముల లక్ష్మణ్ కుమార్, వేముల మల్లికార్జున, వేముల రవి కుమార్, అను ఈ ముగ్గురు అన్నదమ్ములు గని గ్రామంలో దాదాపుగా పదిహేను రోజుల నుండి కనబడడం లేదని గని మంచాలకట్ట గ్రామాలకు చెందిన దాదాపు 30 మంది రైతులు వాపోతున్నారు. అన్నదమ్ములు ముగ్గురు గని గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో రైతులు పండించిన పంట దాదాపు 5 కోట్ల విలువ గల పంట దిగుబడులను కొనుగోలు చేసుకొని రైతులకు డబ్బులు ఇవ్వకుండా అన్నదమ్ములు ముగ్గురు గని గ్రామంలో లేకుండా పరారయ్యారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: