కాదేది వైన్  రూపకల్పనకు అనర్హం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

వైన్ కు ఎక్కువగా ఉపయోగించేందుకు ఏమిటీ అంటే ద్రాక్షా అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. వైన్ రుచిని ఇష్టపడే వారు చాలా మందే ఉన్నారు. ఆ రుచికి ప్రధానంగా ద్రాక్ష పండ్లే కారణం. పండ్లను పులియబెట్టి ప్రత్యేక విధానంలో వైన్ ను తయారు చేస్తారు. కానీ యూపీలో మామిడి పండ్లతో వైన్ ను తయారు చేశారు. ద్రాక్ష పండ్ల సాగు అక్కడ సరిపడా లేకపోవడం.. మామిడి సాగు గణనీయంగా ఉండడమే ఈ నూతన ప్రయత్నానికి నేపథ్యంగా ఉంది. విరివిగా లభించే మామిడి, ఇతర పండ్లతో అక్కడ వైన్ తయారీ చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. దీంతో త్వరలో యూపీలో మామిడి వైన్ అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వం అనుమతి ఇస్తే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఇక మామిడి వైన్ పొంగి పొర్లుతుంది. పెద్ద ఎత్తున మామిడి వైన్ తయారీకి యూనిట్లను ఏర్పాటు చేయాలన్నది ఎక్సైజ్ శాఖ ఆలోచన. స్థానికంగా పండే ప్రముఖ మామిడి రకం దశేరి పండ్లను వైన్ తయారీకి వినియోగించాలన్నది ఎక్సైజ్ శాఖ ప్రణాళిక. మామిడి వైన్ వినియోగం ఎప్పటి నుంచో ఉంది. యూపీలో మాత్రం ఇదే మొదటిసారి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: