నెదర్లాండ్ లో హైదరాబాది మరణం


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డిస్క్)

నెదర్లాండ్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకొంది. అక్కడి ఓ అపార్ట్ మెంట్ లో నివసించే ఓ హైదరాబాద్ అక్కడ జరిగి అగ్నిప్రమాదంలో పొగను తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు. యూరప్ దేశం నెదర్లాండ్స్ లో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ కు చెందిన అబ్దుల్ హదీ కొన్నాళ్లుగా నెదర్లాండ్స్ లోని హేగ్ నగరంలో ఉంటున్నాడు. ఓ అపార్ట్ మెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో అతడి నివాసం ఉంది. అయితే, అగ్నిప్రమాదం జరగడంతో భారీగా పొగలు వెలువడ్డాయి. ఆ పొగ ప్రభావంతో ఉక్కిరిబిక్కిరైన అబ్దుల్ హదీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలు విడిచాడు. అబ్దుల్ హదీ మరణవార్తతో హైదరాబాద్ ఆసిఫ్ నగర్ లో విషాద వాతావరణం నెలకొంది. అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హదీ మృతదేహాన్ని నెదర్లాండ్స్ నుంచి భారత్ కు తరలించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హదీ గతేడాది చివరిసారిగా హైదరాబాద్ వచ్చాడు. మార్చిలో తిరిగి నెదర్లాండ్స్ వెళ్లిపోయాడు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: