స్వదేశీ ఎన్నికల్లో గెలిచేందుకేనటా ఆ వేషాలు


(జానో జాగో వెబ్ న్యూస్-సెంట్రల్ డెస్క్)

సొంత దేశంలో గెలిచేందుకు చైనా ప్రభుత్వం భారతదేశాన్ని రెచ్చగొడుతోందటా. దీనికారణం ఏమిటీ అంటారా భారత్ పై పైచెయ్యి సాధింస్తే ఎన్నికల్లో కూడా పైచెయ్యి సాధించవచ్చన్నది చైనా ప్రభుత్వం యోచన అటా. రెండేళ్ల క్రితం కరోనావైరస్ మొదటి వేవ్ నుంచి బయటపడుతున్న సమయంలో భారత, చైనాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. 2020 మేలో ప్రారంభమైన ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. వీటిని తగ్గించడానికి అనేక రౌండ్ల చర్చలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల, చైనా పాంగోంగ్ త్సో సరస్సుపై వంతెన నిర్మించిందని, గల్వాన్ లోయలో తమ జెండా ఎగురవేసిందని వచ్చిన వార్తలు చూస్తుంటే, ఆ దేశం మరోసారి భారత్‌తో ఉన్న అప్రకటిత సరిహద్దుపై ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. ఈ మేరకు దౌత్య, రాజకీయ వర్గాల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. చైనా కావాలనే ఇదంతా చేస్తోందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఘటనల పట్ల భారత వైఖరిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సంయమనంతో కూడిన స్పందనలే వచ్చాయి. ఈ ఏడాది చైనాలో 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్' జరగనుంది. దానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ చైనా నుంచి ఇలాంటి రెచ్చగొట్టే సంఘటనలు పెరుగుతున్నాయని విదేశీ, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు 2022 చాలా ముఖ్యమైనదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన చారిత్రాత్మకంగా 'మూడవసారి' ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇదిలావుంటే గత ఏడాది నవంబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంలోనే ప్రభుత్వాన్ని నడిపేందుకు విధించిన రెండు పదవీ కాలాల పరిమితిని ముగించింది. దీంతో పాటు 'సెంట్రల్ మిలటరీ కమిషన్' అంటే దేశ సైన్యం పగ్గాలను జిన్‌పింగ్‌కు అప్పగించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంతో షీ జిన్‌పింగ్‌కు మూడోసారి గెలిచేందుకు మార్గం సులభమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడోసారి అధ్యక్ష పదవిని చేపట్టడం జిన్‌పింగ్‌కు కూడా ఇష్టమేనని లండన్‌ కింగ్స్ కాలేజీలోని ఇంటర్నేషనల్ అఫైర్స్ విభాగం అధిపతి హర్ష్ వి పంత్ బీబీసీతో అన్నారు. "అయితే, అది అంత సులువు కాదు. షీ జిన్‌పింగ్ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నారు. కమ్యూనిస్టు పార్టీలోనూ, దేశంలోనూ ఒత్తిడి ఉంది. తన విమర్శకులను శాంతింపజేయడంతో పాటు, జాతీయవాద నాయకుడిగా దేశ ప్రజల్లో తన ఇమేజ్‌ను బలోపేతం చేసుకోవాలి. ఇవి, నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రారంభం కావడానికి ముందే ఆయన ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు" అని పంత్ అన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: