నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను 

బ్రిటీషర్లను గడగడలాడించిన వీరుడు...నేతాజీ

నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (23-01-1897)


 
స్వాతంత్రం కొసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం... మరణం లేని అమరుడు.. భారత్‌కు ఆయుధాలతో పోరాడటం తెలుసని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నతుడు.. స్వాతంత్ర పోరాటం అహింసా మార్గంలోనే కాదు వీర మార్గంలోనూ బ్రిటర్లపై పోరాడుదామని పిలుపిచ్చిన మహావీరుడు.. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్.  నేతాజీ 1879వ సంవత్సరం జనవరి 23వ తేదీ ఒడిశాలోని కటక్‌లో జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు నేతాజీ జన్మించారు.

మాతృదేశం నుండి బ్రిటీష్‌ పాలకులను తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్య్రపోరాట చరిత్ర చివరిథలో నేతాజీ నాయకత్వం లో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లిం పోరాట యోధులు ప్రధాన పాత్ర నిర్వహించారు


మాతృభూమి విముక్తి ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యంలో ముస్లిం మహిళలు కూడా భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్ర బోస్‌ ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన 'ఝాన్సీరాణి రెజిమెంట్‌'లో ఎం.ఫాతిమా బీబి, సయ్యద్‌ ముంతాజ్‌, మెహరాజ్‌ బీబి, బషీరున్‌ బీబీ లాంటి నారీమణులు బాధ్యతలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన వివిధ పోరాటాలలో మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ బాధ్యతలు నిర్వహించగా కల్నల్‌ యం.జడ్‌ కియాని, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హబీబుర్‌ రెహమాన్‌, కల్నల్‌ ఇనాయత్‌ కియాని, కల్నల్‌ మున్వర్‌ హుసైన్‌, కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, కల్నల్‌ బుర్హానుద్దీన్‌, లెఫ్టినెంట్‌ నజీర్‌ అహమ్మద్‌, కల్నల్‌ మలిక్‌, మేజర్‌ మహబూబ్‌ అద్వితీయమైన ప్రతిభతోపాటుగా ప్రాణాంతక పరిస్థితులలో కూడా శత్రువు మీద దాడులు చేయడంలో దృఢసంకల్పాన్ని ప్రదర్శిస్తూ తమ సహచరులకు ఆదర్శంగా నిలిచారు.

చివరకు గమ్యం చేరిన నేతాజీతోపాటుగా రష్యా వెళ్ళేందుకు ఇతర అధికారులతోపాటుగా మేజర్‌ అబిద్‌ హసన్‌ సప్రాని, కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ సిద్దమయ్యారు. జపాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో అందరికి అవకాశం లేకుండా పోవడంతో ఆగస్టు 18న కల్నల్‌ హబీబ్‌ను ఆయన ఎంపిక చేసుకోగా, ఆయన నేతాజీ వెంట బాంబర్‌ విమానంలో బయలుదేరారు. ఆకాశంలోకి ఎగిరిన ఆ విమానం ఫోర్‌మొసా ద్వీపంలో కూలిపోవడంతో తీవ్రంగా గాయపడిన సుభాష్‌ చంద్రబోస్‌ 1945 ఆగస్టు 19న కన్నుమూశారు. ఆయనతోపాటు ప్రయాణించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ గాయపడి చికిత్స అనంతరం బతికి బయటపడి యుద్ద ఖైదీగా ఇతర అధికారులతో కలపి ఇండియాకు తరలించబడ్డారు.

రచయిత-షేక్ అజహర్ 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: